Earthquake: అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు సంబంధిత అధికారులు. భూకంపం రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రత నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. ఈ భూకంపం వల్ల అలాస్కా ద్వీపకల్పంలో సునామీ ప్రమాదం ఉన్నట్టు అధికారులు కనుగొన్నారు. ఈ మేరకు హెచ్చరిక జారీ చేశారు. ఉత్తర అమెరికాలోని ఇతర US కెనడియన్ పసిఫిక్ తీరాలకు, సునామీ ప్రమాద స్థాయిని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సునామీ హెచ్చరికాలు జారీ చేయడంతో అలస్కా, ఇతర తీర ప్రాంత ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.
Also Read: Madhya Pradesh: దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం.. నిందితుల్లో భాజాపా నేత కుమారుడు?