Site icon HashtagU Telugu

TSRTC : టీఎస్ఆర్టీసీ రికార్డు.. ఒక్క రోజులో 45 ల‌క్ష‌ల మందిని…?

Tsrtc Imresizer

Tsrtc Imresizer

టీఎస్ఆర్టీసీ రికార్డు సృష్టించింది. రక్షా బంధన్ సందర్భంగా గురువారం నాడు రికార్డు స్థాయిలో 45 లక్షల మంది ప్రయాణికులను గ‌మ్య‌స్థానాల‌కు చేర్చిన‌ట్లు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది. ఆర్టీసీ 1230 అదనపు సర్వీసులను MGBS, JBS, LB నగర్, ఆరామ్‌గఢ్, సంతోష్‌నగర్ & ఉప్పల్ X రోడ్‌ల నుండి తెలంగాణ, ఇతర రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులను చేర‌వేసింది.

కార్పోరేషన్ సేవలను పెద్దఎత్తున ఆదరిస్తున్న ప్రయాణికులకు ఆర్టీసీ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్థ‌న్ రెడ్డి, ఎండీ వీసీ స‌జ్జ‌నార్‌ కృతజ్ఞతలు తెలిపారు. ర‌క్షాబంధ‌న్ సంద‌ర్భంగా అన్నా చెల్లి, అక్కా త‌మ్ముళ్ల‌ను సంఘటితం చేయడంలో కార్పొరేషన్ తనవంతు పాత్ర పోషించిందన్నారు. భారీ రద్దీ దృష్ట్యా, ప్రయాణీకులకు కొంత అసౌకర్యం కలిగించి ఉండవచ్చని.., దీని కోసం యాజమాన్యం విచారం వ్యక్తం చేస్తుందన్నారు. భవిష్యత్తులో అలాంటి చిన్న అసౌకర్యానికి అవకాశం ఇవ్వకుండా చ‌ర్య‌లు తీసుకుంటామని ఆర్టీసీ యాజ‌మాన్యం హ‌మీ ఇచ్చింది.