పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ లాంటిది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) మే 23 నుంచి జూన్ 1 వరకు SSC పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే బస్సులో ఉచితంగా ప్రయాణించేలా ఆదేశాలు జారీ చేసింది. బస్ పాస్ గడువు తేదీని జూన్ 1, 2022 వరకు పొడిగించినట్లు కార్పొరేషన్ సర్క్యులర్‌లో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను ఉచితంగా చేరవేస్తోంది. తెలంగాణలో ఈ ఏడాది మొత్తం 5, 09, 275 మంది విద్యార్థులు SSC పరీక్షలకు హాజరుకానున్నారు. ఎండల కారణంగా పరీక్షా కేంద్రాలలో అత్యవసర ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, సరైన తాగునీటి సరఫరా కోసం ప్రత్యేక ANM ఆశా వర్కర్లు అందుబాటులో ఉంటారు.
Free Bus Ride: ఎస్ఎస్ సీ స్టూడెంట్స్ కు ‘TSRTC’ గుడ్ న్యూస్!

Ssc