మహిళలకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహిళాదినోత్సవం సందర్భంగా 60ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. ఈనెల 31వ తేదీ వరకు మహిళలకు ఆయా ఆర్టీసీ బస్ డిపోల ఆవరణలో ఉచితంగా స్టాళ్లు పెట్టుకోవచ్చని వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా 30 రోజుల పాటు ఉచితంగా భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణ ఆర్టీసీ ఇవ్వనుంది.గ్రేటర్ పరిధిలో టీ-24 టికెట్‌పై రేపటి నుంచి 14వ తేదీ వరకు 20 శాతం రాయితీ లభించనుంది. గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రెండేసి సీట్లు కేటాయిస్తూ టీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈనెల 31 వరకు మహిళా ప్రయాణికులకు లక్కీ డ్రా ద్వారా వివిధ బహుతులు అందిస్తారు. విజేతలకు నెల రోజులపాటు డిపో నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.బహుమతులు పొందడం కోసం లక్కీ డ్రాలో పాల్గొనాలంటే, ప్రయాణం చేసిన బస్సు టికెట్, ప్రయాణికురాలి ఫొటోను 94409 70000కు వాట్సాప్ చేస్తే చాలు. ఈ వివరాలను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ , ఎండీ సజ్జనార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బోల్డన్నీ నజరాలను తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. రద్దీ సమయంలో మహిళా ప్రయాణికుల కోసం 4 ప్రత్యేక ట్రిప్పులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇలా పలు విధాలుగా మహిళలకు బంపర్ ఆఫర్లను ఆర్టీసీ ప్రకటించింది. ఇంకేం, మహిళలు ఆర్టీసీ వైపు మళ్లండి.
TSRTC Offer For Women : ఆ మహిళలకు ఆర్టీసీలో ఉచితం
మహిళలకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహిళాదినోత్సవం సందర్భంగా 60ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది.

TSRTC MD Sajjanar
Last Updated: 07 Mar 2022, 03:26 PM IST