Site icon HashtagU Telugu

TSRTC Ticket Hike: ప్రయాణికులకు TSRTC షాక్…T24టికెట్ ధర పెంపు..!!

Tsrtc Imresizer

Tsrtc Imresizer

TSRTC ప్రయాణికులకు షాకిచ్చింది. సైలెంట్ గా ఛార్జీలను పెంచేసింది. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్టు అని ప్రకటించిన TSRTC డే పాస్ టికెట్ ధరును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో24గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే సౌకర్యం కలిగిన ట్రావెల్ యూజ్ యువర్ లైక్ టికెట్ ధరను 20రూపాయలకు పెంచేసింది. గతంలో ఈ టికెట్ ధర వంద రూపాయలు ఉండగా…ఇఫ్పుడు 120 రూపాయలకు పెంచుతూ…TSRTC అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన ధరలను శక్రవారం నుంచే అమల్లోకి తీసుకొచ్చింది. గతంలో T24టికెట్ రేట్ ను పలు సందర్భాల్లో 20శాతం డిస్కౌంట్ ఇచ్చారు. మంచి ఆదరణ లభించింది. డిస్కౌంట్ రద్దు చేసిన తర్వాత కూడా ట్రావెల్ యూజ్ యు లైక్ టికెట్ కు ఆదరణ మాత్రం తగ్గలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు RTC అధికారులు ప్రకటించారు.

డీజిల్ ధరలు పెరగడంతోనే…ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది. దీనిలో భాగంగానే తాజాగా సాధారణ టికెట్ ధరలతోపాటు పాస్ ల ధరలను కూడా పెంచింది. వాటిని పెంచిన క్రమంలో ఇప్పుడు T24టికెట్ ధరను కూడా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు స్పష్టం చేశారు.