Site icon HashtagU Telugu

TSRTC: తెలంగాణ విద్యార్థులకు షాకిచ్చిన ఆర్టీసీ..రూట్ బస్ పాసుల ధరలు పెంపు..!!

Tsrtc

Tsrtc

తెలంగాణలో విద్యార్థులకు షాకిచ్చింది టీఎస్ఆర్టీసీ. కొద్దిరోజుల్లోనే పాఠశాలలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో భారీ షాకిచ్చింది. విద్యార్థులకు రూట్ బస్ పాసుల ధరలను ఏకంగా మూడింతలు పెంచేసింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం టీఎస్ఆర్టీసీ నుంచి ఓ కీలక ప్రకటన వెలువడింది.

విద్యార్థుల రూట్ బస్ పాసుల్లో భాగంగా నాలుగు కిలోమీటర్ల దూరానికి ఇప్పటిదాకా 165రూపాయలు చెల్లించేవారు. దానికి ఏకంగా 450 రూపాయలకు పెంచేసింది. అదే సమయంలో 8కిలోమీటర్ల దూరానికి ఇప్పటివరకు 200రూపాయలు ఉన్న ధరను 600లకు పెంచింది. 18కిలోమీటర్ల దూరం ఉన్న బస్ పాస్ ధరను 280 నుంచి 150రూపాయలకు పెంచింది. 22కిలో మీటర్ల బస్ పాస్ ధరను 330 నుంచి 1350కి పెంచింది. ఈ పెంపుతో విద్యార్థులపై భారీ భారం పడనుంది. అయితే ఆర్టీసీని నష్టాల నుంచి గట్టేక్కించేందుకు ఈ చార్జీలు పెంచడం తప్పడంలేదని…అందుకే పెంచినట్లు తెలుస్తోంది.