Site icon HashtagU Telugu

TSRTC : కోఠి- కొండాపూర్ మ‌ధ్య “లేడీస్ స్పెష‌ల్” బ‌స్సు.. మ‌హిళ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరిన ఆర్టీసీ ఎండీ

Tsrtc Imresizer

Tsrtc Imresizer

కోఠి – కొండాపూర్ మధ్య ‘లేడీస్ స్పెషల్’ బస్సును ఆగస్టు 21 నుంచి ప్రారంభించనున్నట్లు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది. ఈ విష‌యాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ ట్విట్ట‌ర్‌లో తెలిపారు. మహిళా ప్రయాణికులు ఈ సేవ‌ను ఉపయోగించుకుని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయ‌న కోరారు. బస్సు నెం. 127కె కోఠి నుంచి ఉద‌యం 8.50 గం.ల‌కి ప్రారంభ‌మై లక్డీకాపూల్, మాసాబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషాకిరణ్, బేగంపేట, కొత్తగూడ ఎక్స్ రోడ్ల మీదుగా కొండాపూర్ చేరుకుంటుందని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. సాయంత్రం 5.45 గంటలకు అదే మార్గంలో కోఠికి బస్సు తిరిగి వస్తుందని తెలిపారు.. మహిళా ప్రయాణికులు ఈ సేవను వినియోగించుకుని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని టీఎస్ ఆర్టీసీ తెలిపింది.