Site icon HashtagU Telugu

TSRTC: ప్రయాణికులకు ఎండి సజ్జనార్ కీలక ప్రకటన

Template (67) Copy

Template (67) Copy

ట్విట్టర్ వేదికగా ఆర్.టీ.సి ఎండి సజ్జనార్ ప్రయాణికులకు కీలక ప్రకటనలు చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో బస్టాండ్ లోని రద్దీతో ప్రయాణికులు తీవ్ర ఇబంధులు ఎదురుకుంటున్నారు. ఒకే ప్రాంతం వైపు వెళ్లదలిచే కాలనీ వాసులు, విద్యార్థులు ఇంకా ఇతరులు ఎవరైనా 30మంది కన్నా ఎక్కువ ఉంటె టీ.ఎస్.ఆర్.టీ.సి ని సంప్రదించాలని.. వారి వద్దకే ప్రత్యక బస్సును పంపిస్తామని ప్రకటించారు. అందుకు అదనంగా 4,318 బస్సులను కేటాయించినట్టు పేర్కొన్నారు. ప్రత్యేక అధికారులను, పోలీసు సిబిబందిని నియమించరు, వారు ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణించేందుకు సహాయపడతారని అన్నారు. హైదరాబాద్ నలుమూలల నుండి బస్సులను ఏర్పాటు చేశారు. సమాచారం కోసం కానీ, ఏదైనా పిర్యాదు చేయడానికి ఈ నెంబర్ లను సంప్రదించాలని కోరారు. రతిఫైల్ బస్టేషన్(9959226154), కోటి బస్టేషన్(9959226160), జూబిలీ బస్టేషన్(9959226246), ఎంజిబిఎస్(9959226257) ప్రయాణికులు సంప్రదించాలి.

 

Exit mobile version