Site icon HashtagU Telugu

AMVI Key: ఏఎంవీఐ ఎగ్జామ్ ఆన్సర్ కీ రిలీజ్

TGPSC NEW UPDATE

AMVI Key : అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష ప్రాథమిక కీని టీఎస్‌పీఎస్సీ రిలీజ్ చేసింది. జూన్ 28న ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్లు(AMVI Key) డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 2 వరకు రెస్పాన్స్ షీట్లు డౌన్‌లోడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

Also read :Sitara Ghattamaneni : ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌‌లో మహేష్ బాబు కూతరు సితార!

ఆన్సర్ ‘కీ’పై ఏమైనా అభ్యంతరాలుంటే జులై 4 నుంచి 6 వరకు క్యాండిడేట్స్ తెలియ జేయవచ్చు. ఆన్‌లైన్ ద్వారా నమోదుచేసే అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో 113 అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షకు 76 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. రాతపరీక్షకు సంబంధించి మొత్తం 5,572 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోగా.. పేపర్‌-1 పరీక్షకు 4734 (76.52 శాతం), పేపర్‌-2 పరీక్షకు 4722 (76.32శాతం) మంది హాజరయ్యారు.