Hyderabad: రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బొల్లారం పోలీసులతో పాటు టీఎస్‌ఎన్‌ఏబీ సిబ్బంది బొల్లారం చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భారీగా గంజాయి వెలుగు చూసింది. వారి వద్ద నుంచి రూ.3.5 కోట్ల విలువైన 1000 కేజీల గంజాయి పట్టుబడింది. వారి వద్ద నుంచి డీసీఎం వ్యాన్,కారు, 4సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. సకారం రాథోడ్, అహ్మద్ ఖాన్, దిగంబర్ రాము పవార్, మరియు అజయ్ రామవతార్ వ్యక్తులపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.బీదర్, మహారాష్ట్ర మరియు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో గంజాయికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఆంధ్రా, ఒడిశా నుంచి గంజాయిని సదరు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు.
Also Read: Gas Cylinder Explosion : గ్యాస్ సిలిండర్ పేలుడు.. పలువురు సజీవ దహనం ?