Site icon HashtagU Telugu

Telangana: ఫిబ్రవరి 21న టీఎస్ ఎంసెట్‌ నోటిఫికేష‌న్‌

TS Inter Exam Dates

TS Inter Exam Dates

Telangana: తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్) తేదీలు ఖరారయ్యాయి.  ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలిపారు. మే 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది జేఎన్టీయూ హైదరాబాద్ ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి 21న టీఎస్ ఎంసెట్‌ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది.

21న నోటిఫికేష‌న్ విడుద‌ల చేసి, 26 నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్లో స్వీక‌రించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ‌కు చివ‌రి తేదీ ఏప్రిల్ 6 గా నిర్ణయించారు. మే 9వ తేదీ నుంచి 12 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ పరీక్షలను జేఎన్టీయూ నిర్వ‌హించ‌నుంది. గతంలో ఇంజినీరింగ్, మెడికల్‌లో ప్రవేశాలకు ఎంసెట్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చేసే వారు. కానీ, ప్రస్తుతం మెడిసిన్, డెంటల్, యునానీ, ఆయుర్వేద, హోమియో కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ను నిర్వహిస్తున్నారు.