Site icon HashtagU Telugu

TS Inter Results: ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌.. చెక్ చేసుకోండిలా, వెబ్ సైట్‌లు ఇవే..!

RRB JE Results

RRB JE Results

TS Inter Results: తెలంగాణ (TSBIE) ఇంటర్మీడియట్ బోర్డు మొద‌టి, ద్వితీయ సంవత్సరం ఫలితాలను (TS Inter Results) విడుద‌ల చేసింది. TSBIE ఇంటర్ 1వ, 2వ సంవత్సరం ఫలితాలను ఉదయం 11 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్ర‌క‌టించారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌లను ఉపయోగించి tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.inలో వారి మార్కుల మెమోలను తనిఖీ చేయవచ్చు. బోర్డు సాధారణ, వృత్తి విద్యా విభాగాలకు కలిపి TS ఇంటర్ 1వ , 2వ సంవత్సరాల ఫలితాలను ప్ర‌క‌టించింది.

విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, టీఎస్ బీఐఈ సెక్రటరీ శృతి ఓజా ఫలితాలను విడుదల చేశారు. TSBIE ఇంటర్ 2024 మార్కుల మెమోను తనిఖీ చేయడానికి, డౌన్‌లోడ్ చేయడానికి విద్యార్థులు తమ హాల్ టిక్కెట్ నంబర్‌లను ఉపయోగించాల‌ని వారు తెలిపారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జ‌రిగిన విష‌యం తెలిసిందే.

అయితే ఈరోజు సాయంత్రం 5 గంట‌ల నుంచి మార్కుల షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. అలాగే రీవాల్యూయేష‌న్ కోసం రేపటి నుంచి ద‌రఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు మే 24 నుంచి మొద‌లవుతాయ‌ని పేర్కొన్నారు. పూర్తి షెడ్యూల్‌ను అధికారులు విడుద‌ల చేస్తార‌ని అధికారులు తెలిపారు.

పాస్ ప‌ర్సంటెజ్‌

– మొదటి సంవత్సరం – 60.13
– ద్వితీయ సంవత్సరం – 64.19

– అమ్మాయిలు 68.35
– అబ్బాయిలు 53.36

ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు దాదాపు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో.. ఇంటర్ ఫస్ట్ ఈయర్ 4,78,527 మంది కాగా.. సెకండ్ ఈయర్ 4,43,993 మంది విద్యార్ధులు ఉన్నారు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి రెండు సంవత్సరాలు కలిపి 92వేల 800 విద్యార్థులు ఉన్నారు. TS ఇంటర్ 1, 2వ సంవత్సరం పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో కనీసం 35 శాతం మార్కులు సాధించాలి.

Also Read: Aston Martin Vantage: వామ్మో.. ఈ కారు ధ‌ర ఎంతో తెలుసా..?

ఫలితాలను తనిఖీ చేయడానికి వెబ్‌సైట్‌లు

విద్యార్థులు తమ ఫలితాలను క్రింది వెబ్‌సైట్‌లలో చూసుకోవచ్చు.

– tsbie.cgg.gov.in

– results.cgg.gov.in

– examresults.ts.nic.in

ఫ‌లితాలు చెక్ చేసుకోండిలా..!

– tsbie.cgg.gov.in. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి

– ‘ఇంటర్ ఫలితం 2024’ లింక్‌పై క్లిక్ చేయండి.

– అవసరమైన ఆధారాలతో లాగిన్ చేయండి.

– ఫలితం తెరపై ప్రదర్శించబడుతుంది.

– TS ఇంటర్ మార్కుల మెమోని డౌన్‌లోడ్ చేసుకోండి.

ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువ‌డిన వేళ ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం.. విద్యార్థులకు కీలక సూచనలు ఇచ్చారు. పరీక్ష ఫలితాలను విద్యార్థులంతా పాజిటివ్‌గా తీసుకోవాలని కోరారు. ఇంటర్మీడియట్ అనే మైలు రాయిని విద్యార్థులంతా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పారు. ఈ మేరకు ఆయన చెప్పారు.

We’re now on WhatsApp : Click to Join

Exit mobile version