TS Assembly : గవర్నర్ – గవర్నమెంట్‌ మధ్య మళ్లీ మొదలైన పంచాయితీ

ఈ బిల్లు ఆమోదం తెలుపాలంటే గవర్నర్ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది

  • Written By:
  • Publish Date - August 4, 2023 / 03:37 PM IST

తెలంగాణ గవర్నర్ (Tamilisai )- కేసీఆర్ (KCR) గవర్నమెంట్‌ మధ్య నిత్యం ఏదొక పంచాయితీ కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికే అనేక సార్లు ఇరువురు పబ్లిక్ గా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోగా..ఇప్పుడు ఆర్టీసీ విలీన పంచాయితీ మొదలైంది. తాజాగా కేసీఆర్ ప్రభుత్వం TSRTC ని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ వద్దకు పంపించగా దానిపై ఇంకా నిర్ణయం తీసుకపోవడం తో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిన్నటి నుండి ప్రారంభమైన సంగతి తెలిసిందే. రేపటి తో సమావేశాలు ముగియనున్నాయి. ఈ సమావేశాలు కేసీఆర్ ప్రభుత్వంలో చివరివి. నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తే వారి సమక్షంలో జరుగుతాయి. ఈ క్రమంలో కేసీఆర్ సర్కార్ కీలకమైన బిల్లులు ఆమోదించుకునేందుకు సిద్దమవుతుంది. వాటిలో ఆర్టీసీ విలీనం బిల్లు ఒకటి. ఈ బిల్లు ఆమోదం తెలుపాలంటే గవర్నర్ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ బిల్లు అనుమతి కోసం గవర్నర్‌ తమిళిసై వద్దకు ఆగస్టు 02 న ప్రభుత్వం పంపించింది. పంపించి రెండు రోజులు అవుతున్న గవర్నర్ దగ్గరి నుండి సమాధానం రాకపోవడం ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ సమావేశాల్లో కచ్చితంగా ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంటే..గవర్నర్ మాత్రం సైలెంట్ గా ఉండడం ఏంటి అని ప్రశ్నింస్తున్నారు.

మరోపక్క ఈ బిల్లు ఫై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 2న మధ్యాహ్నం 3.30కి ఆర్టీసీ బిల్లు రాజ్ భవన్ కు వచ్చింది. అయితే ఈ బిల్లుపై లీగల్ ఒపీనియన్ తీసుకోడానికి కొంత సమయం పడుతుంది.. అందుకే బిల్లును పరిశీలించడానికి కొంత టైం పడుతుందని తెలిపింది. ఇదిలా ఉంటే గవర్నర్ ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపని నేపథ్యంలో ఛలో రాజ్ భవన్ ముట్టడికి కార్మిక సంఘాలు పిలుపునిచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. మొదటి నుంచి గవర్నర్‌ ఇదే తీరున వ్యవహరిస్తున్నారని బిఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.

Read Also : Extramarital Affair: టాక్సీ డ్రైవరుతో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను చంపిన భార్య!