Site icon HashtagU Telugu

TS EAMCET: మార్కుల ఆధారంగా ఎంసెట్ ర్యాంక్

Inter Exam 2022 Ap

కోవిడ్ కారణంగా ఈ విద్యా సంవత్సరం కూడా విద్యార్థులు ఆన్ లైన్ బోధనకే.. పరిమితమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతకాలం క్రితం నుంచి విద్యాసంస్థల్లో ప్రత్యేక్ష బోధన ప్రారంభం అయ్యింది. అయినప్పటికీ…చాలా మంది విద్యార్థులు చదువులో ఇంకా వెనకబడే ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ విద్యార్థులకు సంబంధించి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఎంసెట్ లో ర్యాంకును కేటాయించడానికి ఇంటర్ లో కనీస మార్కులతో పాస్ అయితే చాలని విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం జీవోను కూడా విడుదల చేసింది. పాత నిబంధనల ప్రకారం ఎంసెట్ ర్యాంకు కేటాయించాలంటే…జనరల్ కేటగిరీ ఇంటర్ విద్యార్థులకు 45శాతం మార్కులు ఉండాలి. ఇతరులకు 40శాతం మార్కులు ఉండాల్సిందే. అయితే కోవిడ్ కారణంగా పాస్ అయితే చాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ సారి ఇంటర్ మార్కుకులకు 25శాతం వెయిటేజి అనేది ఉండదు. కేవలం ఎంసెట్ లో వచ్చిన మార్కులతోనే ర్యాంకు కేటాయించబడుతుంది.

Exit mobile version