తెలంగాణ బడ్జెట్ సమావేషాల నేపధ్యంలో మరికాసేపట్లో కేబినేట్ సమావేశం కానుంది. ఈ సమావేశం కోసం ముఖ్యంగా నిరుద్యోగులు, విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయిన నేపధ్యంలో, ఎన్నికలు కూడా దగ్గరపడుతున్న సందర్భంగా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఉద్యోగ భర్తీకి సంబందించిన కీలక ప్రకటన వెలువడే అవకాశమందని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దాదాపు 60 వేల వరకు ఖాళీలను భర్తీ కి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రభుత్వం మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రకటించే అవకాశముందని సమాచారం.
డబుల్ బెడ్ రూమ్ పథకం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో సొంత భూమి ఉండి ఇల్లు కట్టుకునేవారికి ఐదు లక్షల పదివేల రూపాయలు ఇచ్చే పధకానికి కేబినేట్ ఆమోదం తెలిపే అవకాశముంది. పేదలకు ఇంగ్లిష్ మీడియం విద్య కోసం రూపొందిస్తున్న మన ఊరు మన బడి కార్యక్రమానికి కూడా ఈ సమావేశాల్లో బడ్జెట్ కేటాయింపులు ఉండే అవకాశముంది.