Site icon HashtagU Telugu

Trump : ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు సరైనవే..

Elon Musk- Trump

Elon Musk- Trump

Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తన మార్కు హెచ్చరికలతో మళ్లీ చర్చల్లోకి వచ్చారు. అణు కార్యక్రమాలను కట్టడి చేసేందుకు ఇరాన్‌తో కుదుర్చుకున్న “జాయింట్ కంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్” (JCPOA) ఒప్పందం విషయంలో ప్రస్తుతం జరిగిన ప్రతిస్పందనలపై ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

“ఇరాన్‌ అణుఅస్త్రాల అభివృద్ధి దిశగా పయనించేందుకు ప్రయత్నిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌ తీసుకున్న చర్యలు పూర్తిగా సమర్థనీయం. జాతీయ భద్రతను కాపాడుకునేందుకు ఒక దేశం తీసుకునే నిర్ణయాలను తప్పుబట్టడం కష్టమే. ఇది వారి హక్కు,” అని ట్రంప్‌ వెల్లడించారు.

Shubman Gill: టీమిండియా టెస్ట్ కెప్టెన్ గిల్‌పై ట్రోల్స్‌.. బ్యాట్‌పై “ప్రిన్స్” అని ఉండ‌ట‌మే కార‌ణమా?

ఇరాన్‌తో కొత్త న్యూక్లియర్‌ ఒప్పందంపై అమెరికా మరోసారి చర్చలకు సిద్ధంగా ఉందని ట్రంప్‌ పేర్కొన్నారు. అయితే, ఈ ఒప్పందంపై సంతకం చేసేందుకు కేవలం 60 రోజుల సమయం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. “ఈ గడువులోగా ఇరాన్‌ న్యూక్లియర్‌ డీల్‌పై అంగీకరించకపోతే… అది వారి పట్ల తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఇజ్రాయెల్‌ చర్యలు మరింత తీవ్రంగా మారతాయి. చివరికి ఇరాన్‌ పూర్తిగా నాశనం కావడం ఖాయం,” అని ఆయన హెచ్చరించారు.

ఒకప్పుడు ఒబామా ప్రభుత్వం కాలంలో కుదిరిన JCPOA ఒప్పందాన్ని ట్రంప్‌ 2018లో తప్పుబట్టి, అమెరికాను ఒప్పందం నుండి బయటకు తీసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇరాన్‌ మళ్లీ తమ అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోందని, ఇది ప్రపంచానికి ప్రమాదకరమని ట్రంప్‌ ఆరోపించారు.

ఇరాన్‌ అణు శక్తిని తాము సహించలేమని ఇజ్రాయెల్‌ నేతలు ఇప్పటికే ఎన్నోసారి స్పష్టం చేశారు. ఇటీవల సిరియా, లెబనాన్‌ ప్రాంతాల్లోని ఇరాన్‌ మద్దతుదారులపై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో, ట్రంప్‌ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ACB Notice to KTR : ఏసీబీ నోటీసులపై కేటీఆర్, హరీష్ రావు గరం గరం

Exit mobile version