Tomoto Van: బోల్తా పడిన టమాటా లారీ.. ఎగబడ్డ జనాలు?

దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఏ రేంజ్ లో ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం టమాటా ధరలు ఆకాశానంటుతున్నాయి. కొన్ని ప్రదేశాలలో సామాన్య ప్రజలు టమా

Published By: HashtagU Telugu Desk
Tomoto Van

Tomoto Van

దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఏ రేంజ్ లో ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం టమాటా ధరలు ఆకాశానంటుతున్నాయి. కొన్ని ప్రదేశాలలో సామాన్య ప్రజలు టమాటా పేరు వెంటనే భయపడిపోతున్నారు. మొన్నటివరకు కిలో పది రూపాయలు అంతకంటే తక్కువ ధర పలికిన టమాటా ఇప్పుడు ఏకంగా వందలో పలుకుతుండడంతో ప్రజలు టమోటాలను కొనుగోలు చేయడానికి భయపడుతున్నారు. సామాన్య ప్రజలు టమాటా కొనాలంటేనే ఆలోచిస్తున్నారు.

ఏప్రిల్-మే నెలలో అధిక స్థాయిలో ఉన్న వేడి వల్ల టమాటా పంట పైన తీవ్రమైన ఫ్రభావాన్ని చూపి రకరకాల తెగుళ్ళకి కారణమైంది. దీంతో చాలామంది రైతులు పంటను కోల్పోవడంతో టమాటా దిగుమతి భారీగా తగ్గిపోవడంతో ధర విపరీతంగా పెరిగింది. పెరిగిన టమాటా ధరతో అక్కడక్కడా దొంగతనాలు కూడా జరిగిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అలాంటి సంఘటనే ప్రస్తుతం బీహార్ లోను చోటు చేసుకుంది. నేపాల్ నుంచి టమాటా లోడుతో వస్తున్న వ్యాన్ తాజాగా ఆదివారం రోజున ఉదయం 5 గంటల సమయంలో బీహార్ లోని రాంచీ-పాట్నా హైవే పైన వస్తుండగా డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో చర్హివ్యాలీ దగ్గర వ్యాన్ బోల్తా పడింది.

దీంతో వ్యాన్ లోని టమాటాలు రోడ్ పైన పడిపోయాయి. అది గమనించిన స్థానికులు దొరికిందే అవకాశంగా టమాటాలను ఎవరికీ నచ్చినట్లు వాళ్ళు తీసుకెళ్లారు. వ్యాన్ డ్రైవర్, క్లీనర్ ఎంత వారించినా వినకుండా ప్రజలు దోపిడీ చేశారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఇక, టమాటాలను తీసుకువెళుతున్న ప్రజలను చెదరగొట్టి మిగిలిన సరుకుని స్వాధీనం చేసుకున్నారు. టమాటాలను చోరీ చేసుకున్న గ్రామస్తుల దగ్గర నుంచి చాలా వరకు సరుకును వెనక్కి తీసుకువచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. దాదాపు రూ. 200 నుంచి రూ.250 వరకు పలికిన టమాటా ధర ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నప్పటికీ రూ.120 నుంచి రూ.150 వరకు పలుకుతూ ధర ఇంకా వంద పైనే ఉంది.

  Last Updated: 07 Aug 2023, 06:50 PM IST