Site icon HashtagU Telugu

MP Santosh: ప్రతిఒక్కరూ ప్రకృతి నియమాలను పాటించాలి!

Santosh

Santosh

పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీతో కలిసి స్టడీ టూర్‌లో భాగంగా ఎంపీలు సంతోష్ కుమార్, కొత్త ప్రభాకర్ రెడ్డి గిర్ జాతీయ వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించారు. తమ పర్యటనలో భాగంగా స్థానిక మల్ధారిస్ అనే గిరిజనులతో మాట్లాడింది కమిటీ. ప్రకృతి నియమాలను గౌరవిస్తే, అడవి జంతువులతో కూడా జీవించవచ్చని, ఈ విషయాలన్నీ మల్ధారిస్ గిరిజనుల వద్ద తెలుసుకున్నామని ఎంపీలు అన్నారు. ఈ సంచార జాతులు, వారి సంస్కృతి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని ఆకట్టుకుందని సంతోష్ కుమార్ అన్నారు.  ఈ మల్ధారీలు జానపద పాటలను తమ భాషలో పాడుతున్నప్పుడు వారి ముఖాల్లో సంతోషం కనిపిస్తోందని ఆయన అన్నారు. ఈ మేరకు ఎంపీ సంతోష్ కుమార్ ‘ఇది కాదా రిఫ్రెష్ అంటే’ అని ట్వీట్ చేశారు.