Site icon HashtagU Telugu

TRS Kavitha: సబ్బండ వర్ణాల సంక్షేమం టీఆర్‌ఎస్‌ పార్టీతోనే సాధ్యం: కవిత

Trs Kavitha

Trs Kavitha

వాషింగ్టన్‌లో టీఆర్ఎస్ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ బిడ్డలు తమ మాతృభూమి రుణం తీర్చుకునేందుకు వీలైనంత సహకారం అందించాలి – టీఆర్‌ఎస్ ప్రవాస విభాగ సభ్యులతో ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ అమెరికాలో స్థిరపడిన తెలుగు ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి పలు అంశాలపై నిర్మాణాత్మకంగా చర్చించేందుకు ఆటా మహాసభలు మంచి అవకాశం కల్పించాయన్నారు. వాషింగ్టన్‌లో టీఆర్‌ఎస్ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. విదేశాల్లో గొప్ప స్థానాల్లో స్థిరపడిన ప్రవాస తెలుగు వారు రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

ఈ ఏడాది ఆటా మహాసభల్లో తొలిసారిగా తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీఎం శ్రీ కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఎన్నో గొప్ప కార్యక్రమాలను నిర్వాసితులకు తెలియజేసేందుకు ఆటా మహాసభలు వేదికగా మారాయని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు.

విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు తమ మాతృభూమి రుణం తీర్చుకునేందుకు తమవంతు సహకారం అందించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, గాదరి కిషోర్‌, చల్లా ధర్మారెడ్డి, గువ్వల బాలరాజు, చంటి క్రాంతి కిరణ్‌, బొల్లం మల్లయ్య, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, టీఆర్‌ఎస్‌ ఎన్నారై సెల్‌ కోఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల పాల్గొన్నారు.

Exit mobile version