Site icon HashtagU Telugu

MLC Kavitha: ఢిల్లీలో మహా ధర్నా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha Maha Dharna

Mlc Kavitha Maha Dharna

కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా దేశ రాజ‌ధాని ఢిల్లీలో నిర్వ‌హించ‌బోయే మ‌హా ధ‌ర్నా ఏర్పాట్ల‌ను ఎమ్మెల్సీ క‌విత ప‌రిశీలించారు. తెలంగాణ నుంచి వరిధాన్యం కొనుగోలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఢిల్లీలో ఏప్రిల్ 11న జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర్వ‌హించ‌నున్న నిర‌స‌న కార్యక్రమాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

ఈ నేప‌ధ్యంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నాయకులు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారని సమాచారం. ధాన్యం సమస్యపై న్యూఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన మహా ధర్నాకు ఒకరోజు ముందు, ఒకే దేశం ఒకే సేకరణ విధానం ఆవశ్యకతపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలు డిమాండ్‌తో దేశ రాజధానిలోని ప్రధాన వీధుల్లో సీఎం కేసీఆర్ హోర్డింగ్‌లు ఉండేలా పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ నుంచి మొత్తం వరి పంటను సేకరించేలా కేంద్ర ప్ర‌భుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని టీఆర్ఎస్ పార్టీ న్యూఢిల్లీలో నిరసనకు పిలుపునిచ్చింది. ఈ క్ర‌మంలో పార్టీ నేతలు వివిధ డిజైన్లలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న సవతి తల్లి వైఖరిని ఈ పోస్టర్లు తెలియజేస్తున్నాయని పార్టీ నేతలు తెలిపారు.