Site icon HashtagU Telugu

Congress Vs TRS : రేగా వ‌ర్సెస్ పోదెం.. భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో హీటెక్కిన రాజ‌కీయం

Podem Veeraiah

Podem Veeraiah

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేల మ‌ధ్య మాట‌ల య‌ద్ధం కొన‌సాగుతుంది. జిల్లాకు చెందిన కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరూ పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, పినపాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు మధ్య వార్ న‌డుస్తుంది. భద్రాద్రి జిల్లాలో ఉన్న ఐదు సీట్లు గెలుస్తామని రేగా కాంతారావు స‌వాల్ చేస్తుండ‌గా… జిల్లాలోని ఐదు సీట్లు గెలవడం కాదు కదా.. నువ్వు కూడా ఎమ్మెల్యేగా ఈసారి గెలవలేవు అంటూ రేగా కాంతారావును ఉద్దేశించి.. పొదెం వీరయ్య వ్యాఖ్యానించారు. సొంత నియోజకవర్గంలో రేగాను గెలవనివ్వను అంటూ పోదెం వీర‌య్య సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో పొదెం వీరయ్య ఎమ్మెల్యేగా గెలవలేడని, మరో నియోజకవర్గం చూసుకోవాల్సిందే అని రేగా కాంతారావు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో నీ అడ్రస్ ఎక్కడుంటుందో చూస్తానంటూ వీరయ్యకు రేగా ప్రతి సవాల్ విసిరారు. సోషల్ మీడియా వేదికగా ఇరువురూ విసురుకుంటున్న సవాళ్లు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి.