TRS MLA:టీఆర్ఎస్ ఎమ్మెల్యేను నిలదీసిన రైతులు..!!

టీఆరెస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు ఛేదు అనుభవం ఎదురైంది. వరికోతలు కోసి రోజులు గడుస్తున్నా...ఇంకా వడ్లు కల్లాల్లోనే ఉన్నాయి.

Published By: HashtagU Telugu Desk
Rasamayi

Rasamayi

టీఆరెస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు ఛేదు అనుభవం ఎదురైంది. వరికోతలు కోసి రోజులు గడుస్తున్నా…ఇంకా వడ్లు కల్లాల్లోనే ఉన్నాయి. దీంతో రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినా…దానికి తగ్గట్లుగా కొనుగోలు చేయడంలేదని రైతులు మండిపడుతున్నారు.
ఇందులోభాగంగా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను నిలదీశారు రైతులు. వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. అధికారులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పినా రైతులు ఎమ్మెల్యేను వదలలేదు.

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నెలరోజులుగా ఉండి…ఎన్ని ఇబ్బందులు గురవుతున్నామో తెలుసా అంటూ నిలదీశారు. అకాల వర్షంతో నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అడ్డగించడంతో రసమయి ఒక్కసారిగా షాక్ అయ్యారు.

  Last Updated: 26 May 2022, 03:42 PM IST