Site icon HashtagU Telugu

Central Home Minister : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కాన్వాయ్‌కి అడ్డుగా ఉన్న టీఆర్ఎస్ నేత కారు ధ్వంసం..?

Trs Imresizer

Trs Imresizer

హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. పంజాగుట్ట వద్ద శనివారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాన్వాయ్ మార్గాన్ని కారు అడ్డుకోవడంతో భద్రతా బలగాలు గందరగోళానికి గురయ్యాయి. కారును భద్రతా సిబ్బంది ధ్వంసం చేసినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. ఉదయం కేంద్రం ఆధ్వర్యంలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలకు హాజరైన అనంతరం మంత్రి పరేడ్ గ్రౌండ్స్ నుంచి బయలుదేరుతున్నారు. కాన్వాయ్ గ్రీన్‌లాండ్స్‌లోని హరిత ప్లాజా హోటల్‌కు దగ్గరగా వచ్చినప్పుడు అక్క‌డ రెడ్ క‌ల‌ర్ కారు కాన్వాయ్‌కి అడ్డుగా వ‌చ్చింది. అయితే ఈ కారు అద్దాన్ని అమిత్‌షా భ‌ద్ర‌తా సిబ్బంది ప‌గ‌ల‌గొట్టిన‌ట్లు వార్తా సంస్థ‌లు నివేదించాయి. ఈ కారు టీఆర్‌ఎస్‌ నాయకుడు గోసుల శ్రీనివాస్‌కు చెందిన కారు అని ప్రెస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐ వెల్లడించింది.