Site icon HashtagU Telugu

TRS: ఈసీని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం

Election preparation

స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సర్వోత్తమ కేంద్ర ఎన్నికల కమిషన్ ను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ లతో ప్రధాన మంత్రి కార్యాలయం ఉన్నతాధికారులు రహస్యంగా సమావేశం ఇటీవల సమావేశం కావడం ఆక్షేపనీయమని వినోద్ కుమార్ పేర్కొన్నారు. పీఎంవో తీరు భారత దేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని వినోద్ కుమార్ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కు ప్రపంచంలోనే ప్రఖ్యాతులు ఉన్నాయని, ప్రపంచ దేశాలు భారత దేశ ఎన్నికల కమిషన్ పని తీరును అనేక సందర్భాల్లో కొనియాడాయని వినోద్ కుమార్ గుర్తు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక చర్యలను ప్రతి ఒక్కరూ నిరసించాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.