‘‘తెలంగాణ బీజేపీలోకి వివిధ పార్టీల నేతల చేరికలు ఉంటాయి. త్వరలోనే టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారు‘‘ అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా ఆలేరు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఆలేరు ప్రజలతో కలవకుండా కుట్రలు చేశారని, ప్రజలకు సేవ చేసేందుకే బీజేపీలో చేరబోతున్నట్లు భిక్షమయ్య గౌడ్ తెలిపారు.
BJP: బీజేపీ గూటికి టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే!

Ex Mla