Site icon HashtagU Telugu

TRS Formation Day : అట్ట‌హాసంగా టీఆరెస్ ఆవిర్భావ స‌భ ..11 తీర్మానాలుంటాయన్న కేసీఆర్‌

Kcr55

Kcr55

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ అధికార తెలంగాణ రాష్ట్ర స‌మితి ఆవిర్భావ వేడుక‌ల‌కు ప్లాన్ చేస్తోంది. ఈ నెల 27న ఈ వేడుక‌లు నిర్వ‌హించ‌డానికి పార్టీ స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి పార్టీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం 27న ఉద‌యం 11.05 గంట‌ల‌కు పార్టీ ప‌తాకాన్ని ఆవిష్క‌రిస్తారు. ఆవిర్భావ స‌మావేశంలో 11 తీర్మానాల‌ను ప్ర‌వేశ‌పెడ‌తారు. ఈ వేడుక‌ల‌కు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు హాజ‌రు కానున్నారు.