కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై మండిపడ్డారు టీఆరెస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. అమిత్ షా పచ్చి అబద్దాలు మాట్లాడి అబద్దాలకు అంబాసిడర్ గా మారారాని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి బాల్క సుమాన్ టీఆరెస్ ఎల్పీ మీడియాతో మాట్లాడారు.
ఆర్టికల్ 370 రద్దుకు టీఆరెస్ పార్టీ మద్దతు తెలుపలేదని అమిత్ షా మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370రద్దుకు టీఆరెఎస్ మద్దతు తెలిపిందని… ఈ అంశంపై లోకసభలో ఎంపీ నామానాగేశ్వరరావు మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఇన్ని అబద్దాలు మాట్లాడిన అమిత్ షా తక్షణమే క్షమాపణ చెప్పాలని సుమన్ డిమాండ్ చేశారు. కుటుంబ పాలనపై అమిత్ షా మాట్లాడిన మాటలు గురువింద గింజ సామెత మాదిరిగా ఉన్నాయి అన్నారు. బీజేపీలో ఎంతమంది వారసులు పదువుల్లో లేరా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ కీలకపాత్ర పోషించారని…ప్రభుత్వంలో భాగస్వామ్యం పంచుకుంటే తప్పు ఎలా అవుతుందన్నారు. క్రికెట్ అంటే తెలియని అమిత్ షా కుమారుడు బీసీసీఐ పదవిలో ఎలా ఉన్నారంటూ ప్రశ్నించారు. దమ్ముంటే కుటుంబ పాలనను నిషేధిస్తూ బీజేపీ కార్యవర్గంలో తీర్మానం చేయాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.
Live: Govt Whip, MLA @balkasumantrs Press Meet at TRSLP https://t.co/VccI0FaWFP
— BRS Party (@BRSparty) May 15, 2022