Mob Looting Arms : మణిపూర్‌లో హింసాకాండ ఆగడం లేదు.. థౌత్‌బాల్ జిల్లాలోని ఖంగాబోక్ వద్ద ఉన్న 3వ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ (IRB) క్యాంపుపై దాదాపు 500 మంది అల్లరి మూకలు దాడికి తెగబడ్డారు.. అక్కడి నుంచి ఆయుధాలను దోచుకెళ్లే యత్నం చేశారు.. అయితే భద్రతా దళాలు వారిని అడ్డుకున్నారు. టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. అనివార్య పరిస్థితుల్లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో జనంలో ఒకరు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి.
Also read : Sharad Pawar Vs Ajit Pawar : ఎన్సీపీ ఎమ్మెల్యేల సపోర్టు ఎవరికి ? తేలేది నేడే !
“సైనిక దళాల కదలికను నిరోధించడానికి ఆ అల్లరి మూక IRB క్యాంపు చుట్టూ రోడ్ ను బ్లాక్ చేసింది. వెంటనే రంగంలోకి దిగిన అస్సాం రైఫిల్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు అల్లరి మూకను(Mob Looting Arms) చెదరగొట్టి, అక్కడి నుంచి వెళ్ళగొట్టాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి” అని ఆర్మీ పేర్కొంది. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఈ గొడవలు కొనసాగాయని తెలుస్తోంది. ఈనేపథ్యంలో థౌత్‌బాల్ జిల్లాలో కర్ఫ్యూ సడలింపును రద్దు చేశారు.