Site icon HashtagU Telugu

Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్ కారుకు జరిమానా

Trivikram

Trivikram

హైదరాబాద్ పోలీసులు గత కొద్దిరోజులుగా తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎవరైతే బ్లాక్ ఫిల్మ్ ఉన్న కార్లను వినియోగిస్తున్నారో.. వారందరికీ జరిమానాలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో తనిఖీలు చేస్తున్న సమయంలో అటువైపుగా వచ్చిన త్రివిక్రమ్ కారును ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఆయన కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగించి, రూ.700 జరిమానా విధించారు. వారంరోజుల వ్యవధిలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, కల్యాణ్ రామ్ కార్లకూ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.