Janasena : కొణతాల టిక్కెట్టు వెనుక త్రివిక్రమ్ గేమ్..?

  • Written By:
  • Publish Date - March 14, 2024 / 04:38 PM IST

ఏపీలో సీట్ల పంపకాలు జరుగుతున్నాయి. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై ఆయా పార్టీల అధిష్టానాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇందుకోసం గెలుపు గుర్రాలను సెలక్ట్‌ చేసేందుకు కసరత్తు సాగుతుంది. అయితే.. ఈ సారి గెలిచి అధికారంలోకి రావాలనే పట్టుదలతో టీడీపీ (TDP), జనసేన (Janasena)- బీజేపీ (BJP)తో పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఏ పార్టీకి ఎన్ని సీట్లో చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారు. అయితే.. గత ఐదేళ్లుగా కొణతాల రామకృష్ణ (Konathala Ramakrishna) రాజకీయంగా దాదాపుగా అజ్ఞాతంలో ఉండి, వయసు, ఆరోగ్యం కారణంగా పెద్దగా కార్యాచరణ ప్రదర్శించలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) కొణతాలను హఠాత్తుగా కలుసుకుని పార్టీలోకి ఆహ్వానించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ కనెక్షన్ ఎక్కడికి దారితీసింది?

We’re now on WhatsApp. Click to Join.

పైగా ఇందులో టీడీపీకి సంబంధం లేదు. కొణతాల రాజకీయ ప్రయాణం అంతా కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ తోనే సాగింది. కొణతాల రామకృష్ణ పేరు “బ్రో” సినిమా సమయంలో పవన్ దృష్టికి మొదట వచ్చింది. ఆ సినిమాకు దర్శకుడు చిన్నికృష్ణ త్రివిక్రమ్‌కి అసోసియేట్‌గా పనిచేశాడు. కొణతాల రామకృష్ణకు చిన్ని కృష్ణ చాలా దగ్గరి బంధువు. ఈ విషయం త్రివిక్రమ్ (Trivikram)కి తెలియడంతో ఆఖరికి పవన్ కి కూడా అతని ద్వారా తెలిసింది.

“బ్రో” సినిమా సమయంలోనే త్రివిక్రమ్‌కి చిన్ని కృష్ణ బాగా దగ్గరయ్యాడు. దీన్ని గుర్తించిన త్రివిక్రమ్ పీపుల్స్ మీడియాలో చిన్ని కృష్ణకు కీలక బాధ్యతలు అప్పగించారు. కొణతాలకు జనసేన నుంచి టికెట్‌ వచ్చేలా చూడాలని త్రివిక్రమ్‌ని చిన్ని కృష్ణ కోరినట్లు సమాచారం. కొణతాల చర్చలపై త్రివిక్రమ్ పవన్ దృష్టిని ఆకర్షించేవాడు. గతంలో విశాఖలో తన తల్లి విజయమ్మను ఓడించడం వల్లే కొణతాలపై జగన్ ఆగ్రహంగా ఉన్నారని కూడా ఆయనతో పంచుకున్నారు.

జగన్‌తో పొత్తు పెట్టుకోని వారిని ఇష్టపడటం వల్లే కొణతాలను పవన్ తన గూటికి చేర్చుకున్నారని భావించవచ్చు. త్రివిక్రమ్ రికమెండేషన్ కూడా ఓ పాత్ర పోషించి ఉండవచ్చు. ఐదేళ్ల విరామం తర్వాత ఎట్టకేలకు కొణతాల వెలుగులోకి వచ్చింది. అలా కొణతాల జనసేనలో చేరడం వెనుక పరోక్ష శక్తి త్రివిక్రమ్.
Read Also : AP Politics : టీడీపీ, జనసేన కోసం బీజేపీ మరిన్ని సమస్యలను సృష్టిస్తోందా.?