సౌత్ లో రెండు దశాబ్ధాలుగా హీరోయిన్ గా కెరీర్ కొనసాగించిన భామల లిస్ట్ లో మొదటగ త్రిష పేరు వినిపిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో త్రిష (Trisha) చేసిన సినిమాలు ఆమెకు సూపర్ క్రేజ్ తీసుకొచ్చాయి. ఒకటి రెండుసార్లు బాలీవుడ్ ప్రయత్నాలు చేసినా అవి పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఐతే తెలుగులో కూడా కాస్త ఫాం తగ్గింది అనుకున్న అమ్మడు కేవలం కోలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ వచ్చింది. 96 సినిమా త్రిష కెరీర్ కు మళ్లీ మంచి బూస్టింగ్ ఇచ్చింది.
ఆ సినిమా తర్వాత అమ్మడు వరుస క్రేజీ సినిమాలు చేసింది. ఇప్పటికి త్రిష లీడింగ్ లో ఉంది అంటే ఆమె టాలెంట్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఐతే 40 ప్లస్ ఏజ్ లో కూడా తన అందంతో మెస్మరైజ్ చేస్తుంది త్రిష. ఇప్పుడొచ్చిన కొత్త హీరోయిన్స్ కి కూడా త్రిష టఫ్ ఫైట్ ఇచ్చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు త్రిష అందానికి కారణం ఏంటని తెలుసుకోవాలని అందరు అనుకుంటారు.
త్రిష ఇన్ స్టా (Trisha Instagram) ఓపెన్ చేస్తే చాలు అమ్మడు టీనేజ్ గర్ల్ మాదిరిగా తన క్యూట్ లుక్స్ తో అదరగొట్టేస్తుంది. లేటెస్ట్ గా త్రిష షేర్ చేసిన ఫోటో చూస్తే మాత్రం అమ్మడికి ఏజ్ నిజంగానే 20 ప్లస్ అంటే నమ్మాల్సిందే. అందరు ఏదేదో తింటారు కానీ త్రిష మాత్రం అందం తిని బతికేస్తుందా ఏంటని అనుకుంటున్నారు.
మొన్నటిదాకా కోలీవుడ్ లో వరుస సినిమాలు చేసిన త్రిష ఇప్పుడు మళ్లీ తెలుగులో క్రేజీ ఛాన్స్ లు అందుకుంటుంది. అమ్మడు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర (Viswambhara) సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు చర్చల దశల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అవి కూడా స్టార్ సినిమాలని తెలుస్తుంది. ఏది ఏమైనా త్రిష ఫాం చూస్తుంటే మరో ఐదారేళ్లు ఇదే జోష్ కొనసాగించేలా ఉందని అనిపిస్తుంది.