Trinamool Clean Sweep : పశ్చిమ బెంగాల్ పంచాయతీ పోల్స్ ను దీదీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. రాత్రి 11 గంటల వరకు విడుదల చేసిన ఫలితాల ప్రకారం.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చెందిన యొక్క తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీయే ఎక్కువ స్థానాల్లో గెలిచింది. 3,317 గ్రామ పంచాయతీలకుగానూ 2,551 గ్రామ పంచాయతీలను ( 80% స్థానాలు) దీదీ పార్టీ కైవసం చేసుకుంది. మరో 600 స్థానాల్లోనూ టీఎంసీ ముందంజలో ఉందని అధికారులు వెల్లడించారు. ఇక ఫలితాల పట్టికలో రెండో స్థానంలో బీజేపీ నిలిచింది. 213 గ్రామ పంచాయతీలను బీజేపీ గెల్చుకుంది. వామపక్షాలు 32, కాంగ్రెస్ 17 గ్రామ పంచాయతీ స్థానాలను మాత్రం గెలిచాయి. బుధవారం సాయంత్రం కల్లా ఈ ఎలక్షన్ కు సంబంధించిన మొత్తం రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే.. బెంగాల్ లో గ్రామపంచాయతీల సంఖ్య చాలా ఎక్కువ. ఏకకాలంలో వాటన్నింటి బ్యాలెట్ల లెక్కింపు (Trinamool Clean Sweep) అంటే సాధారణ విషయం కాదు. అందుకే కౌంటింగ్ కు ఇంతగా టైం తీసుకుంటోంది.
స్థానిక సంస్థ(ఆధిక్యం/స్థానాలు) | టీఎంసీ | బీజేపీ | వామపక్షాలు | కాంగ్రెస్ | ఐఎస్ఎఫ్ పార్టీ | ఇతరులు |
---|---|---|---|---|---|---|
గ్రామ పంచాయతీ 3111/3317 | 2,551 | 213 | 32 | 17 | 8 | 290 |
పంచాయతీ సమితి 245/341 | 232 | 7 | 1 | 0 | 0 | 5 |
జిల్లా పరిషత్ 12/20 | 12 | 0 | 0 | 0 | 0 | 0 |