Site icon HashtagU Telugu

KTR: రేపు రాష్ట్రవ్యాప్తంగా జనగామ జడ్పీఛైర్మన్ సంపత్‌రెడ్డికి నివాళులు అర్పించాలి – కేటీఆర్

Ktr

Ktr

KTR: జనగామ జడ్పీఛైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి పార్ధివదేహానికి  బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పాగాల సంపత్‌రెడ్డి హఠాన్మరణం బాధాకరం అన్నారు. 14 ఏళ్లు కేసీఆర్ వెంట సైనికుడిలా ఉండి పని చేశారని, సంపత్‌రెడ్డి మరణం ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్తను కలచి వేసిందన్నారు.

జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సంపత్‌రెడ్డి క్రియాశీలకంగా పని చేశారని, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నిబద్ధతతో పనిచేస్తూ విజయవంతం చేశారన్నారు. సంపత్‌రెడ్డి కుటుబానికి కేసీఆర్, పార్టీ శ్రేణుల తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంపత్‌రెడ్డి మరణం పార్టీకి తీరని లోటన్న కేటీఆర్, వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జెడ్పీఛైర్మన్లు, జిల్లా అధ్యక్షులు పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులు అర్పించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Exit mobile version