Site icon HashtagU Telugu

Trent Boult: ఐపీఎల్ లో 100 వికెట్లు తీసిన ట్రెంట్ బోల్ట్

trent boult

Whatsapp Image 2023 04 23 At 4.33.32 Pm

Trent Boult: ఐపీఎల్ 2023 32వ మ్యాచ్‌లో బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన RCB జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి బంతికే ట్రెంట్ బౌల్ట్ చేతిలో LBWగా ఔటయ్యాడు. ఈ వికెట్ తీయగానే బోల్ట్ తన పేరిట ఓ ఘనత సాధించాడు.

నిజానికి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి బంతికే ట్రెంట్ బౌల్ట్‌కు బలయ్యాడు. ఖాతా తెరవకుండానే కోహ్లీ పెవిలియన్ బాట పట్టాడు. టీ20లో తొలిసారి కోహ్లీని ట్రెంట్ అవుట్ చేశాడు.దీంతో బోల్ట్ తన ఐపీఎల్ కెరీర్‌లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. కేవలం 84 మ్యాచులోనే బోల్ట్ ఈ ఫీట్ సాధించాడు. కాగా ఈ 100 వికెట్లలో 46 వికెట్లు పవర్‌ప్లేలో, మొదటి ఓవర్‌లో 21 వికెట్లు వచ్చాయి. IPL 2023లో ట్రెంట్ బౌల్ట్ ఎకానమీ రేటు 2.5.

Read More: Chalaki Chanti: జబర్దస్త్ చంటికి అసలు ఏమయ్యింది.. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో తెలుసా?