Transgenders In Forces : కేంద్ర భద్రతా బలగాల్లోకి ట్రాన్స్‌జెండర్లు.. పార్లమెంటరీ కమిటీ సిఫార్సు

Transgenders In Forces :  ట్రాన్స్‌జెండర్లకు ఇప్పటివరకు గవర్నమెంట్ జాబ్స్ వస్తుండగా మనం చూశాం..

  • Written By:
  • Updated On - August 6, 2023 / 05:35 PM IST

Transgenders In Forces :  ట్రాన్స్‌జెండర్లకు ఇప్పటివరకు గవర్నమెంట్ జాబ్స్ వస్తుండగా మనం చూశాం..

త్వరలో ఆర్మీలో గన్ పట్టుకున్న ట్రాన్స్‌జెండర్లను కూడా మనం చూసే అవకాశం ఉంది..  

ఎందుకంటే వారికి కేంద్ర భద్రతా బలగాల్లో అవకాశం కల్పించే దిశగా ఒక  ప్రయత్నం మొదలైంది .. 

Also read : Train Derail: పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి, 50 మందికి పైగా గాయాలు

ట్రాన్స్‌జెండర్లకు కూడా  సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో ఛాన్స్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర హోం శాఖకు    బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్) సిఫార్సు చేసింది. ప్రధాన స్రవంతి సమాజంతో ట్రాన్స్‌జెండర్లు కలిసిపోయేలా చేసేందుకుగానూ.. కేంద్ర భద్రతా బలగాల్లో చేరేలా వారిని ప్రోత్సహించాలని కోరింది. ఇందుకోసం ట్రాన్స్‌జెండర్లకు(Transgenders In Forces)  కూడా కొన్ని రకాల రిజర్వేషన్లను ఇవ్వొచ్చని కమిటీ తెలిపింది. ప్రస్తుతం సీఏపీఎఫ్ లో 3.76 శాతం మందే  మహిళలు ఉన్నారని,  ఫ్యూచర్ లో ఈ సంఖ్యను పెంచేలా కొత్త విధి విధానాలను, ప్రోత్సాహకాలను అమలు చేయాలని కేంద్రం హోం శాఖకు  పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ  రికమెండ్ చేసింది. సీఏపీఎఫ్ లో మహిళలకు కేటాయించిన పోస్టుల్లో 3.65 శాతం మాత్రమే ఇప్పటిదాకా భర్తీ అయ్యాయని గుర్తు చేసింది. రిక్రూట్ అయ్యే మహిళల సంఖ్యను పెంచేందుకుగానూ.. సీఏపీఎఫ్ లోని మహిళా అధికారులకు సాఫ్ట్ (సురక్షిత ప్రాంతాల్లో) పోస్టింగ్‌లు ఇచ్చి అనుకూల వాతావరణాన్ని సృష్టించాలని కమిటీ సూచించింది.

Also read : Gaddar Passes Away: బిగ్ బ్రేకింగ్.. ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత