Transgender : ప్రాణాలు విడిచిన ట్రాన్స్ జెండర్ ఎంపీ.. బ్రతికున్నంత కాలం శభాష్ అనిపించుకుందిగా?

మామూలుగా ట్రాన్స్ జెండర్స్ అంటే అందరూ చిన్న చూపు చూస్తూ ఉంటారు. కానీ వాళ్లు కూడా మనుషులే.. అందరిలాగా వాళ్లకు కూడా మనసు ఉంటుంది. ఒకప్పుడు ట్రాన్స్ జెండర్స్ కి అసలు విలువ లేకపోయేది.

  • Written By:
  • Updated On - March 6, 2023 / 11:00 PM IST

Transgender : మామూలుగా ట్రాన్స్ జెండర్స్ అంటే అందరూ చిన్న చూపు చూస్తూ ఉంటారు. కానీ వాళ్లు కూడా మనుషులే.. అందరిలాగా వాళ్లకు కూడా మనసు ఉంటుంది. ఒకప్పుడు ట్రాన్స్ జెండర్స్ కి అసలు విలువ లేకపోయేది. కానీ ఇప్పుడు కాలం మారుతున్న కొద్ది వాళ్ళపై గౌరవం పెరిగింది. వాళ్ళు కూడా అన్ని రంగాలలో ముందుంటున్నారు. సినీ, రాజకీయ, ఇతర రంగాలలో కూడా ఆరితేరుతున్నారు.

ఇక రాజకీయపరంగా ఎంపీగా రికార్డు సాధించిన తొలి ట్రాన్స్ జెండర్.. జార్జినా బేయర్. న్యూజిలాండ్ మాజీ చట్టసభ ప్రతినిధి అయిన జార్జినా గత కొన్ని రోజుల నుండి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఈమె ఈరోజు తుది శ్వాస విడిచారు. నార్త్ ఐలాండ్ లో మారుమూల గ్రామంలో జన్మించిన ఈమె.. మొదట సెక్స్ వర్కర్ గా పనిచేసింది. ఆ తర్వాత సినిమాల్లో నటించింది. ఇక రాజకీయాల్లో అడుగుపెట్టి మొదట కార్టర్ టన్ కు మేయర్ గా ఎన్నికయింది.

అలా ఆ పదవి చేపట్టిన తొలి ట్రాన్స్ జెండర్ గా అందరి దృష్టిలో గర్వంగా నిలిచింది. ఆ తర్వాత 1999లో లేబర్ పార్టీ తరపున పోటీ చేసి పార్లమెంటులో అడుగు పెట్టింది. అలా 2007 వరకు ఎంపీగా కొనసాగగా.. రెయిన్బో కమ్యూనిటీకి సేవల కోసం 2020లో క్వీన్ ఎలిజిబెత్ ద్వారా న్యూజిలాండ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో సభ్యురాలుగా పనిచేసింది. ఇక ఆ సమయంలో ఆమె ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది.

ఇక ఈమె గత కొంతకాలంగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏడు తుది శ్వాస విడిచింది. ఈ విషయాన్ని ఆమె స్నేహితులు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇక ఈమె మరణ వార్త విని న్యూజిలాండ్ ప్రధానితో సహా పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.