Transformer Exploded: పేలిన ట్రాన్స్‌ఫార్మర్.. 20 షాపులు దగ్ధం

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తిరుపతమ్మ ఆలయం సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ (Transformer) ఒక్కసారిగా పేలింది. దీంతో పక్కనే ఉన్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి.

Published By: HashtagU Telugu Desk
China Explosion

Bomb blast

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తిరుపతమ్మ ఆలయం సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ (Transformer) ఒక్కసారిగా పేలింది. దీంతో పక్కనే ఉన్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి. షాపుల్లోని సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలడంతో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. స్థానికులు విషయం పోలీసులకు తెలియజేసారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఘటనలో 20 షాపులు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది నాలుగు గంటలు శ్రమించి మంటలు అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగింది. ఒక్కో దుకాణంలో సుమారు రూ.2 నుంచి రూ.3 లక్షల విలువైన వస్తువులు దగ్ధమైనట్లు వ్యాపారులు చెబుతున్నారు. మొత్తంగా రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read: Daughter-in-Law: కోడలిని పెళ్లి చేసుకున్న మామ.. షాకింగ్ ఘటన ఎక్కడ అంటే ?

  Last Updated: 27 Jan 2023, 07:10 AM IST