Site icon HashtagU Telugu

Transfers: ఏపీలో ‘ఐఏఎస్‌’ అధికారులకు బదిలీలు!

Ap Secretariat Imresizer

Ap Secretariat Imresizer

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొత్త డీజీపీని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా.. కీలక బాధ్యతలు నిర్వహించే ఐఏఎస్ అధికారులను బదిలీ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన జీవోను కూడా విడుదల చేసింది.

అధికారుల బదిలీలు ఇవే..
అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్‌కుమార్ ప్రసాద్‌ , సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌.జవహర్‌రెడ్డి.. అయితే టీటీడీ ఈవోగాను కె.ఎస్‌.జవహర్‌రెడ్డి కొనసాగుతారని స్పష్టం చేసింది. సీసీఎల్‌ఏగా జి.సాయిప్రసాద్‌, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా జి.ఎస్‌.ఆర్‌.కె.ఆర్‌.విజయ్‌కుమార్‌, రవాణాశాఖ కమిషనర్‌గా ఎం.టి.కృష్ణబాబుకు అదనపు బాధ్యతలు, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్‌కుమార్‌, క్రీడలు, యువజనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్‌ భార్గవకు అదనపు బాధ్యతలు, ఏపీపీఎస్‌సీ కార్యదర్శిగా బాబు.ఎ కు పూర్తి అదనపు బాధ్యతలు, పీఎస్‌ అధికారి పి.సీతారామాంజనేయులుకు ఏపీపీఎస్‌సీ కార్యదర్శి నుంచి రిలీవ్, ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పీఎస్ఆర్ ఆంజనేయలు, కేవీరాజేంద్రనాధ్ రెడ్డికి ఏసీబీ డీజీగా బదిలీ, ఏపీ డీజీపీ పూర్తి అదనపు బాధ్యతల్లోనూ ఆయన కొనసాగింపు, విజిలెన్సు ఎన్ ఫోర్సుమెంట్ ఏడీజీగా శంకబ్రతబాగ్చి లను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

Ias Transfer