Site icon HashtagU Telugu

Kalaburagi: పట్టాలపై అతిపెద్ద బండరాయి.. వందల మంది ప్రాణాలు కాపాడిన లోకో పైలట్?

Kalaburagi

Kalaburagi

ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంతో చాలామంది ప్రయాణికులు రైలులో ప్రయాణించాలి అంటేనే భయపడిపోతున్నారు. ఇటీవల జరిగిన ఈ ప్రమాదంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా అటువంటి ప్రమాదమే ఒకటి తప్పింది. దాంతో వందలాది మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే ట్రాక్ పక్కన ఒక భారీ బండరాయి దొర్లుకు రావడంతో అది గమనించిన లోకో పైరేటి వెంటనే రైలు నియంత్రించాడు.

లేదంటే ఊహించని విధంగా చాలా ఘోర ప్రమాదం జరిగి ఉండేది. ఒకసారి ఆ ఘటనను ఊహించుకుంటేనే గుండె జల్లుమంటోంది. తాజాగా బీదర్‌ నుంచి కలబురగికి సంచరించే డెము ప్యాసింజర్‌ రైలు 0774 పెద్ద ప్రమాదం నుంచి బయట పడింది. నిన్న అనగా సోమవారం రోజున ఉదయం 7.30 గంటలకు బీదర్‌ నుంచి బయల్దేరిన రైలు సొరంగ మార్గంలో వెళ్తుండగా ఒక భారీ బండ ట్రాక్‌ పక్కనే వచ్చిపడింది. కలబురగి జిల్లా కమలాపురలో మరగుత్తి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం 9 గంటలకు సొరంగ మార్గంలోకి ప్రవేశించేందుకు కొంత సమయానికి ముందు బండరాయి ట్రాక్‌ పక్కనే పడినట్టు తెలుస్తోంది.

రైలు టన్నెల్‌ లోకి ప్రవేశించిన తర్వాత పట్టాల పక్కన బండరాయి ఉన్నట్టు లోకో పైలట్‌ గుర్తించాడు. వెంటనే రైలును నియంత్రించాడు. ఆ తర్వాత రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. అయితే ఆ రైలులో దాదాపుగా వెయ్యి మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు ప్రమాదాన్ని గుర్తించి అక్కడి నుంచి రెండు మూడు కిలోమీటర్ల మేర నడిచి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లారు. తర్వాత రైల్వే సిబ్బంది బండరాయిని తొలగించి తర్వాత రైళ్ల రాకపోకలకు వీలు కల్పించింది. అయితే ఈ ఘటన పట్ల లోకో పైలట్ వ్యవహరించిన తీరుపై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. లోకో పైలెట్ ఏమాత్రం అజాగ్రత్తగా ఏమరుపాటుగా ఉన్నా కూడా ఎవరు ఊహించని దారుణమైన ప్రమాదం జరిగి ఉండేది.

Exit mobile version