Site icon HashtagU Telugu

Train Ticket Transfer : ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేయకుండా బదిలీ చేయొచ్చా.. ఎలా చేయాలంటే..!

Train accident

Train accident

Train Ticket Transfer ట్రైన్ టికెట్ బుకింగ్ చేసుకున్నాక కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక్కోసారి ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఒక్కోసారి రద్దు చేసుకుంటారు. క్యాన్సిల్ చేసుకున్న తర్వాత టికెట్ కోసం చెల్లించిన మొత్తం రేటులో కొంత కట్ చేసి మిగిలిన మొత్తాన్ని అకౌంట్ కి జమ చేస్తారు. అయితే టికెట్ క్యాన్సిల్ చేయకుండా టికెట్ ని వేరొకరికి బదిలీ చేసే అవకాశం కూడా ఉంది.

మొన్నటిదాకా ప్రయాణం చేయకపొతే ట్రైన్ టికెట్ (Train Ticket) క్యాన్సిల్ చేసుకోవడమే అవకాశం ఉంది. ఇప్పుడు ట్రైన్ టికెట్ రద్దు చేయకుండా వేరొకరికి ట్రాన్స్ ఫర్ ఫర్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. తల్లిదండ్రులు, సిస్టర్, బ్రదర్, కొడుకు, కూతురు, భార్యా, భర్త ఇలా సమీప కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న టికెట్ ని బదిలీ చేసుకునే ఛాన్స్ కల్పిస్తుంది రైల్వే డిపార్ట్మెంట్.

Also Read : IT Job Cuts : ఐటీలో వేలాదిగా జాబ్ కట్స్.. ఎందుకు ?

ట్రైన్ స్టార్ట్ అవడానికి 24 గంటల ముందు రైల్వే శాఖకు (Railway Station) రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ అవకాశం టికెట్ కన్ఫర్మ్ అయిన వారికి మాత్రమే ఉంటుంది. అంతేకాదు ఈ ఛాన్స్ ఒకసారి మాత్రమే ఉపయోగించుకునే వీలు ఉంటుంది. అంటే ఒకసారి బదిలీ చేస్తే ఆ టికెట్ వేరే వాళ్ల పేరు మీదకు మార్చడం కుదరదు. ట్రాన్స్ ఫర్ చేసుకున్న వారు టికెట్ ని ప్రింట్ తీసుకుని తమ దగ్గర ఉంచుకోవాలి.

ఎవరి పేరు మీద టికెట్ మార్చుతారో వారి ఆధార్ కార్డ్ (Aadhar Card), పాన్ కార్డు (PAN Card), ఓటర్ కార్డ్ గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి కంపల్సరీగా ఉండాలి. ఈ వెసులుబాటు కోసం దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్ కి వెళ్లి టికెట్ బదిలీ రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వివరాల కోసం గుర్తింపు కార్డ్ సమర్పించడం కంపల్సరీ అని తెలుస్తుంది. ఆన్ డ్యూటీ మీద వెళ్లే గవర్న మెంట్ ఉద్యోగులు తోటి ఉద్యోగికి టికెట్ ని బదిలీ చేయొచ్చు. గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో విద్యార్ధులు కూడా వేరొక స్టూడెంట్ కి టికెట్ బదిలీ చేయొచ్చు.