Site icon HashtagU Telugu

Accident : నాగ్‌పూర్ రైల్వేస్టేష‌న్‌లో ప్ర‌మాదం.. రైలు కింద ప‌డి మృతి చెందిన మ‌హిళ‌

Train Accident

Train Accident

నాగపూర్ రైల్వే స్టేషన్‌లో ప్ర‌మాదం జ‌రిగింది. కదులుతున్న రైలు ఎక్కుతూ ఓ మ‌హిళ జారి ప‌డి మ‌ర‌ణిచింది. గాయత్రీ స్వామివివేకానంద పాండే అనే మ‌హిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి దానాపూర్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లోని బి1 కోచ్‌లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. నాగ్‌పూర్ స్టేషన్‌లో భోజనం చేసేందుకు రైలు ఆగగానే గాయత్రి దిగింది. రైలు స్టార్ట్ అయ్యేసరికి ఆమె ఆహారం కొంటోంది. రైలు వెళ్లిపోతుంద‌నే కంగారులో ఆమె కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా రైలుకు ప్లాట్‌ఫారమ్‌కు మధ్య ఉన్న గ్యాప్‌లో జారి పడిపోయింది. తలకు పలుచోట్ల గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన తర్వాత రైలును నిలిపివేశారు.