Site icon HashtagU Telugu

Road Accident: బైక్ ని ఢీకొట్టిన సిమెంట్ ట్రైలర్.. మహిళ మృతి

Road Accident

New Web Story Copy 2023 09 12t172344.918

Road Accident: రాజస్థాన్ రామ్‌దేవ్రా నుంచి బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను సిమెంట్‌ కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జత్రు అనే మహిళ మృతి చెందింది. కొద్దిసేపటికే సిమెంట్ ట్రైలర్‌ క్యాబిన్ లో మంటలు చెలరేగాయి. ప్రమాదం అనంతరం ట్రైలర్‌ డ్రైవర్‌ పరారయ్యాడు. బందర్‌సింద్రీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అజ్మీర్‌-కిషన్‌గఢ్‌ హైవేపై మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అజ్మీర్-జైపూర్ హైవే దాదాపు 3 గంటలపాటు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రైలర్ డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: Telangana Liberation Day: సెప్టెంబర్ 17న తెలంగాణకు అమిత్ షా