9 Kanwariyas Electrocuted: బీహార్‌లో విషాదం చోటు చేసుకుంది.వైశాలి జిల్లాలోని ఇండస్ట్రియల్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హై ఓల్టేజీ విద్యుత్ వైరు తగిలి ఎనిమిది మంది కన్వాడీలు మరణించారు. వీరంతా వాహనంలో హరిహరనాథ్ ఆలయానికి జలాభిషేకం చేసేందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో అనుకోని ప్రమాదం వారిని కబళించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుల్తాన్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారణం గురించి ప్రస్తుతానికి ఏమీ చెప్పలేము, అయితే డీజే ట్రాలీలో వెళుతుండగా 11 వేల వోల్ట్ వైర్ మైక్‌కు తాకడం వల్ల ఈ ఘోర ప్రమాదం సంభవించి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కన్వాడీలు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మృతులంతా సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన వారని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఓం ప్రకాశ్ తెలిపారు. శ్రావణ మాసంలో అక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆగస్ట్ 4న కూడా అలాగే రాత్రి 12 గంటల సమయంలో అందరూ పహెల్జా ఘాట్ నుంచి గంగాజలం నింపి హరిహరనాథ్ ఆలయంలో జలాభిషేకం చేసేందుకు వెళ్లారు.దారి మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఘటన జరిగిన వెంటనే విద్యుత్ కార్యాలయానికి ఫోన్ చేసినా ఎవరూ తీయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మృతదేహాలను తమ కస్టడీలోకి తీసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం సదర్ ఆసుపత్రికి తరలించి మొత్తం కేసును దర్యాప్తు చేస్తున్నారు.
మృతుల వివరాలు:
రవి కుమార్, తండ్రి- ధర్మేంద్ర పాశ్వాన్.
రాజ కుమార్, తండ్రి- దివంగత లాలా దాస్.
నవీన్ కుమార్, తండ్రి- దివంగత ఫుదేనా పాశ్వాన్.
అమ్రేష్ కుమార్, తండ్రి – సనోజ్ భగత్.
అశోక్ కుమార్, తండ్రి – మంటూ పాశ్వాన్.
చందన్ కుమార్, తండ్రి – చందేశ్వర్ పాశ్వాన్.
కలు కుమార్, తండ్రి- పరమేశ్వర్ పాశ్వాన్.
ఆశి కుమార్, తండ్రి – మింటు పాశ్వాన్.
అమద్ కుమార్, తండ్రి దేవి లాల్
Also Read: Indian Cricket Team: 27 ఏళ్లుగా భారత్‌దే పైచేయి.. కానీ ఈసారి సీన్ రివర్స్..!