Warangal : వరంగల్‌లో విషాదం.. పాత భవనం కూల్చివేతలో ఇద్దరు కార్మికులు మృతి

వ‌రంగల్ పట్టణంలో విషాదం నెల‌కొంది. పాత భవనం కూల్చివేత స‌మ‌యంలో ప్ర‌మాద‌వ‌శాత్తు ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌లో మరో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. పాత కట్టడాన్ని కూల్చివేస్తున్న సమయంలో పట్టణంలోని చార్బోవ్లి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో కొంత భాగం కార్మికులపై పడిందని, శిథిలాల కింద వారు చిక్కుకుని పోయార‌ని పోలీసులు తెలిపారు. పోలీసులు, మున్సిపల్ ఉద్యోగులతో పాటు సైట్‌లోని ఇతర కార్మికులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఇద్దరు కార్మికుల మృతదేహాలను శిథిలాల […]

Published By: HashtagU Telugu Desk
Warangal

Warangal

వ‌రంగల్ పట్టణంలో విషాదం నెల‌కొంది. పాత భవనం కూల్చివేత స‌మ‌యంలో ప్ర‌మాద‌వ‌శాత్తు ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌లో మరో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. పాత కట్టడాన్ని కూల్చివేస్తున్న సమయంలో పట్టణంలోని చార్బోవ్లి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో కొంత భాగం కార్మికులపై పడిందని, శిథిలాల కింద వారు చిక్కుకుని పోయార‌ని పోలీసులు తెలిపారు. పోలీసులు, మున్సిపల్ ఉద్యోగులతో పాటు సైట్‌లోని ఇతర కార్మికులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఇద్దరు కార్మికుల మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు. గాయపడిన మరో ఇద్దరు కార్మికులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కూల్చివేతలో నిమగ్నమైన కొందరు కార్మికులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విషాదానికి దారితీసిందని చెబుతున్నారు. ఈ ఘటనపై మున్సిపల్ అధికారులు విచారణకు ఆదేశించారు.

  Last Updated: 11 Jun 2022, 06:22 PM IST