Site icon HashtagU Telugu

Tragedy in Bengaluru: బెంగళూరులో విషాదం.. కూలిన మెట్రో పిల్లర్.. తల్లి, కొడుకు మృతి

Hyd Metro

Hyd Metro

మెట్రో స్టేషన్స్, పిల్లర్స్ ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. మంగళవారం బెంగళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిపోవడంతో ఓ మహిళ, ఆమె రెండేళ్ల కుమారుడు మృతిచెందారు. మహిళ, ఆమె భర్త, కుమారుడు బైక్‌పై ప్రయాణిస్తుండగా నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిపోయింది.  అయితే వెంటనే ముగ్గురిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి, బిడ్డ మృతి చెందారు.

వారిని తేజస్వి (25), విహాన్ (2)గా గుర్తించారు. మరోవైపు భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈస్ట్ డీసీపీ భీమాశంకర్ మాట్లాడుతూ “దంపతులు తమ కొడుకుతో కలిసి హెబ్బాల్ వైపు వెళ్తున్నారు. మెట్రో పిల్లర్ ఓవర్‌లోడ్‌తో బైక్‌పై కూలింది. తల్లి, కొడుకు తీవ్రంగా గాయపడటంతో ఆల్టిస్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి, కొడుకు మృతి చెందారు’’ అని తెలిపాడు.