హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, హౌసింగ్‌బోర్డ్ కాలనీలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మూడు రోజులు సెలవుకావడంతో షాపింగ్‌మాల్స్ అన్ని వినియోగదారులతో కళకళలాడుతున్నాయి. మరోవైపు జెఎన్టీయూ దగ్గరలో లులు షాపింగ్ మాల్ ప్రారంభంకావడంతో సదర్శకులు మాల్ చూసేందుకు తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో బాగా రద్దీ ఏర్పడింది. శనివారం మధ్యాహ్నం నుండి ప్రారంభమై ఆదివారం రాత్రి వరకు ట్రాఫిక్ జామ్ కొనసాగింది. గాంధీ జయంతి దృష్ట్యా సోమవారం కూడా సెలవు దినం కావడంతో సోమవారం రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ప్రయాణికులు, వాహనదారులు భావిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా నగర వాసులు షాపింగ్ చేస్తున్నారు. వీకెండ్ రోజుల్లో అందరూ షాపింగ్‌కి రావడంతోనే ఈ ట్రాఫిక్‌జామ్ ఏర్పడిందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఎస్ ఆర్ నగర్ నుంచి కేపీహెచ్‌బీ కి వెళ్లేందుకు దాదాపు రెండు గంటల సమయం పట్టిందని వాహనదారులు తెలిపారు.
Trafic In KPHB : హైదరాబాద్ కూకట్‌పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్.. కారణం ఇదే..?

Trafic