Site icon HashtagU Telugu

Hyderabad: వాహనాదారులు అలర్ట్, రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు!

Technical Glitches

Traffic

Hyderabad: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపు హైదరాబాద్ వేదికగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలే కాకుండా, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే లాంటివాళ్లు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రేపు హైదరాబాద్ లో పలు చోట్లా ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి.

ముఖ్యంగా ట్రాఫిక్‌ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాదారులు అలర్ట్ గా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ఎల్బీ స్టేడియం, లక్డీకాపూల్ సహా పలు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని డీజీపీ రవిగుప్తా చెప్పారు. మరోవైపు భద్రత ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా ఉన్నాయని డీజీపీ వెల్లడించారు.

తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లను ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, సీపీ సందీప్ శాండిల్య, జీహెఎంసీ కమిషనర్ రొనాల్డ్‌ రోస్‌ కలిసి పరిశీలించారు. దాదాపు లక్ష మంది సభకు హాజరు అయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో 30వేల మందికి కూర్చొనే సౌకర్యం ఉందని అధికారులు తెలిపారు.

Exit mobile version