Site icon HashtagU Telugu

Pre Event: ‘భీమ్లా నాయక్’ ఫ్రీ రిలీజ్ వేడుకకు వెళ్లాలనుకుంటే.. ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే!

Bheemla Nayak

Bheemla Nayak

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 25న అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతోంది ఈ చిత్రం. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ‘భీమ్లా నాయక్’ ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. పవన్ కు ప్రత్యర్థి పాత్రలో రాణా దగ్గుబాటి నటించిన ‘భీమ్లా నాయక్’ లో హీరోయిన్లుగా నిత్యా మీనన్, సంయుక్త మీనన్ నటించారు. సోమవారం రాత్రి 9 గంటలకు విడుదల చేసిన ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ వేడుక ఈనెల 21న జరగాల్సి ఉండగా.. అది క్యాన్సిల్ అయింది. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం కారణంగా… ప్రీ రిలీజ్ ఈవెంట్ ను 23వ తేదీకి వాయిదా వేశారు. యూసఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్స్ లో బుధవారం ‘భీమ్లా నాయక్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ వేడుకకు, ముఖ్య అతిధిగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రాబోతున్నారు. ఆయనతో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు.

ఇకపోతే ‘భీమ్లా నాయక్’ ఫ్రీ రిలీజ్ వేడుక కోసం వచ్చే అభిమానులను కంట్రోల్ చేసేందుకు గాను హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఆ వివరాలను కింద గమనించగలరు.

పోలీసుల ట్రాఫిక్ ఆంక్షల నడుమ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్:

– ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు

– భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 2 గం. నుంచి రాత్రి 11 గం. వరకు ట్రాఫిక్ ఆంక్షలు

– యూసఫ్ గూడ పోలిస్ గ్రౌండ్స్ లో రేపు ప్రీ రిలీజ్ వేడుక

– మైత్రీవనం నుంచి యూసఫ్ గూడ వైపు వెళ్లే వాహనాలకు అనుమతి నిరాకరణ

– సవేరా ఫంక్షన్ హాల్-క్రిష్ణ కాంత్ పార్క్-కళ్యాణ్ నగర్-సత్యసాయి నిగమగమం-కృష్టానగర్ మీదుగా మళ్ళింపు

– జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి యూసఫ్ గూడా వైపు వచ్చే వాహనాలు శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగమగమం వైపు మళ్ళింపు

– సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్, యూసఫ్ గూడా మెట్రో స్టేషన్ , కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడయం, ప్రభుత్వ పాఠశాలలో పార్కింక్ ప్రదేశాలు

– 21వ తేదీతో ఇచ్చిన పాసులకు అనుమతి లేదని వెల్లడి

– కేవలం 23వ తేదీ ఉన్న పాసులకు మాత్రమే అనుమతి

bheemla nayak pre event

Exit mobile version