Site icon HashtagU Telugu

Traffic Restrictions : రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic

Traffic

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 26న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం నిర్వహించనుంది.ఈ వేడుక‌ల‌కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. బెంజిసర్కిల్ వైపు నుంచి ఎంజీ రోడ్డు వైపు వచ్చే వాహనాలను బెంజి సర్కిల్, స్క్రూ బ్రిడ్జి, కృష్ణలంక జాతీయ రహదారి మీదుగా బస్ స్టేషన్ వైపు మళ్లిస్తారు. రెడ్ సర్కిల్ నుంచి ఆర్టీఏ కూడలి, శిఖామణి కూడలి నుంచి వెటర్నరీ కూడలి వైపు ఏ విధమైన వాహనాలను మళ్లించరు. బెంజిసర్కిల్ నుంచి డీసీపీ బంగ్లా కూడలి వరకు వీఐపీల వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. పాత కంట్రోల్ రూం నుంచి బెంజి సర్కిల్ వైపు వచ్చే అన్ని వాహనాలను రెండు మార్గాల్లో మళ్లించనున్నారు. ఆర్టీసీ వై జంక్షన్, కార్ల్ మార్క్స్ రోడ్డు, విజయా టాకీస్, చుట్టుగుంట, పడవల రేవు, రామవరప్పాడు మీదుగా మళ్లిస్తారు. అటు ఆర్టీసీ వై జంక్షన్, బందరు లాకులు, రాఘవయ్య పార్కు, కృష్ణలంక హైవే స్క్రూ బ్రిడ్జి మీదుగా వాహనాలను మళ్లిస్తారు.