Site icon HashtagU Telugu

Traffic Diversions: హనుమాన్ శోభాయాత్ర.. సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు!

Traffic Rules

Traffic

(ఏప్రిల్ 16న) హనుమాన్ శోభా యాత్ర సందర్భంగా హైదరాబాద్ లోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. ఈనేపథ్యంలో వాహనదారులు శనివారం ఉదయం 9 గంటల నుంచి 2 గంటల మధ్య, మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల మధ్య వెళ్లాల్సిన రూట్ల వివరాలను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఉదయం 11.30 గంటలకు గౌలిగూడలోని రామ మందిరం నుంచి హనుమాన్ ప్రధాన శోభా యాత్ర ప్రారంభమై.. రాత్రి 8 గంటలకు తాడ్ బండ్ లోని హనుమాన్ టెంపుల్ కు చేరుకుంటుందని తెలిపారు. కర్మన్ ఘాట్ హనుమాన్ గుడి వద్ద మొదలయ్యే మరో శోభా యాత్ర .. డీఎం అండ్ హెచ్ఎస్ , ఉమెన్స్ కాలేజ్ జంక్షన్ వద్ద ప్రధాన శోభా యాత్రతో కలుస్తుందని చెప్పారు. కాబట్టి ఈ మార్గాల్లో ట్రాఫిక్ జామ్ లు ఉంటాయని స్పష్టం చేశారు.

ఉదయం 9 నుంచి 2 మధ్య

* లక్డీ కా పూల్ నుంచి దిల్ సుఖ్ నగర్ వైపు వెళ్లాలనుకునే వాళ్లు.. బషీర్ బాగ్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, హిమాయత్ నగర్ వై జంక్షన్, నారాయణగూడ ఫ్లై ఓవర్, బర్కత్ పుర, ఫీవర్ హాస్పిటల్, రైట్ టర్న్ తిలక్ నగర్ రోడ్, 6 నంబర్ జంక్షన్, అలీ కేఫె క్రాస్ రోడ్, మూసారాంబాగ్ మీదుగా దిల్ సుఖ్ నగర్ కు వెళ్లాలి.

* దిల్ సుఖ్ నగర్ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లాలనుకునేవాళ్లు.. ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్ ఓఆర్, చాంద్రాయణ గుట్ట, ఆరాంఘర్, అత్తాపూర్ మీదుగా మెహిదీపట్నం వెళ్లాలి.

మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 

* లక్డీకాపూల్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ లేదా ఉప్పల్ వైపు వెళ్లే వాళ్లు.. వీవీ స్టాట్యూ, సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట ఫ్లై ఓవర్, ప్రకాశ్ నగర్ ఫ్లై ఓవర్, పారాడైజ్ ఫ్లై ఓవర్ ల మీదుగా ఉప్పల్ కు వెళ్లొచ్చు.

Exit mobile version